40.2 C
Hyderabad
April 24, 2024 17: 46 PM
Slider వరంగల్

జేసిబిని దొంగిలించిన వ్యక్తి అరెస్ట్

#warangalpolice

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో జెసిబిని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి చోరీ చేసిన జేసిబిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ రాజస్థాన్ రాష్ట్రం, ఆల్వార్ జిల్లా, రాంఘడ్ ప్రాంతానికి పోలీసులు అరెస్టు చేసిన జఫ్రూ డీన్ తన స్వగ్రామంలొనే గ్యాస్ గోడౌన్ లో డెలవరీ బాయ్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

నిందితుడి మిత్రులు కొద్ది మంది వరంగల్ లో జెసిబి డ్రైవర్లగా పనిచేయడంతో పాటు జేసిటి కిరాయిలకు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిందితుడు భావించాడు. వరంగల్ నగరంలో ఒక జెసిబిని చోరీ దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేయవచ్చని నిర్ణయించుకోన్నాడు.

ఇందులో భాగంగానే హన్మకొండ చేరుకున్న నిందితుడు ఈ సంవత్సరం జనవరి 13వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో వడ్డేపల్లి చర్చి ప్రాంతంలో పార్క్ చేసి వున్న టిఎస్. 36 ఈ 2422 నంబర్ గల జెసిబిని నిందితుడు దొంగ తాళాల సాయంతో చోరీ చేసి నిందితుడే స్వయంగా నడుపుకుంటూ జేసిబిని ములుగు, ఏటూరునాగారం, ఛత్తీస్ ఘడ్ మీదుగా రాజస్థాన్ చేరుకోని అక్కడ జెసిబిని అమ్మేందుకు ప్రయత్నించాడు.

జెసిబి తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ తో వుండటంతో ఎవరు జెసిబి కోనుగోలు చేయకపోవడంతో నిందితుడు చివరికి చోరీ చేసిన ప్రాంతంలో జెసిబి అమ్మేందుకు తిరిగి జేసిబిని హన్మకొండకు తీసువచ్చాడు. హంటర్ రోడ్డు ప్రాంతంలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్ తన సిబ్బందితో వెళ్ళి నిందితుడిని అరెస్టు చేసిన జెసిటి స్వాధీనం చేసుకున్నారు. జెసిబి దోంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్ తో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Related posts

బాసరలో దసర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS

బతుకమ్మ చీరలను పరిశీలించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

విక్రమ సింహపురి వర్సిటీకి ఎన్ఎస్ఎస్ అవార్డు

Satyam NEWS

Leave a Comment