32.2 C
Hyderabad
March 29, 2024 00: 05 AM
Slider ముఖ్యంశాలు

శాల్యూట్: మానవత్వంతో స్పందించిన పోలీస్ గుండె

#SubedariPolice

లాక్ డౌన్ వేళ మండుటెండలో రోడ్డుపై నడుస్తూ వెళ్ళుతున్న గర్భవతిని రైల్వే స్టేషన్ కు చేర్చి వరంగల్ సుబేదారి ఇన్స్ స్పెక్టర్ రాఘవేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు.

సికింద్రబాద్ బోయినపల్లిలో నివాసం వుంటున్న వెంగళ అఖిల గర్భవతి కావడంతో తన భర్త అయిన  రమేశ్ తో కల్సి హన్మకొండలోని తన తల్లిగారి ఇంటికి వచ్చింది.

అఖిల గర్భవతి కావడంతో స్థానిక హన్మకొండ లోని లక్ష్మీ నర్సింగ్ హోం లో పరీక్షలు నిర్వహించుకోని తిరిగి కాజీపేట రైల్వే స్టేషన్ కు వెళ్ళేందుకు సిద్ధపడ్డది.

అయితే ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవటంతో అఖిల తన భర్త తో కల్సి మండుటెండలో కాలినడకన వెళ్ళుతున్న సమయంలో జిల్లాపరిషత్ ప్రాంతంలో పెట్రోలింగ్ సుబేదారి ఇన్స్ స్పేక్టర్ కాలినడక వెళ్ళుతున్న అఖిలను గమనించారు.

తక్షణమే అఖిలను, ఆమె భర్తను తన పోలీస్ వాహనంలో కాజీపేట్ రైల్వే స్టేషన్ లో దింపడంతో దంపతులు ఇద్దరు పోలీస్ ఇన్స్ స్పేక్టర్ అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.

Related posts

బాసరలో భక్తుల సందడి: వైభవంగా వసంత పంచమి వేడుకలు

Satyam NEWS

పీఈటీ, పండిట్ టీచర్ల నల్ల బ్యాడ్జీల నిరసన

Bhavani

వరద ప్రాంతాలలో మంత్రి ఈటల విస్తృత పర్యటన

Satyam NEWS

Leave a Comment