కడప నగరంలోని ప్రధాన కూడలిలో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఒంటెద్దు ప్రదీప్ రెడ్డి, జాల జయవర్ధన్, అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి సుబ్బమ్మ లు డిమాండ్ చేశారు. స్థానిక ఓంశాంతి నగర్ లోని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడప నగరం సుందరికరణలో భాగంగా ప్రధాన కూడళ్ళలో వివిధ స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని అయితే స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఎలాంటి చర్యలు తీసుకోలేదాన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా స్పందించి నగరంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాం ఏర్పాటు చేయకపోతే కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల భారత అగ్రగామి మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు అరుణ కుమారి, అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.
previous post