Slider కడప

50 శాతం సబ్సిడీతో రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ

#Dy CM Amzad Bhasha

రైతుల పక్షపాతిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. పాత కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన రైతులకు జీలుగలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 50 శాతం సబ్సిడీతో జీలుగలు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నారన్నారు.

40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు

విత్తనాల పంపిణీ కార్యక్రమం గతంలో మండల స్థాయిలో చేసేవారని నేడు గ్రామస్థాయిలో గ్రామ సచివాలయల ద్వారా రైతులకు విత్తనాలు ఇస్తున్నామని అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు గ్రామ సచివాలయంలో డబ్బులు చెల్లించి రాయితీ పొందవచ్చనన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగ లేనప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి కావలసిన విత్తనాలన్నీ సబ్సిడీతో ఇస్తున్నామని చెప్పారు.

మే 15వ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు  రైతుల ఖాతాకు జమ చేస్తామని అన్నారు.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మార్కెట్ యార్డ్ లలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని దీంతో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించారని రైతులు సామాజిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జె.డి మురళి కృష్ణ, ఎ డి ఎ నరసింహారెడ్డి, ఏ ఈ ఓ రమేష్, పావని తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముషీరాబాద్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

ఎంతో వేగంగా కదిలిన నరేంద్రమోడీ

Satyam NEWS

హంస వాహనం పై విహరించిన శ్రీశైలేశుడు

Satyam NEWS

Leave a Comment