31.2 C
Hyderabad
April 19, 2024 06: 52 AM
Slider ముఖ్యంశాలు

విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం..!

#Thunderstroms

విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఆరుగంటలకే..భానుడు ప్రభావంతో జిల్లా హీటెక్కిపోయింది.

ఈ రోజు.. ఎండలు మాడు పగలు కొట్టడం ఖాయమని జిల్లా ప్రజల అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే సాయంత్రం ఏడు అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయ్యింది.

మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రంలో కారు మేఘాలు కమ్మాయి.ఈదురు గాలులతో నగరం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.

దీంతో వర్షం మొదలైంది దీనికి తోడు… ఉరుములు, మెరుపులతో నగరం మొత్తం చల్లబడిపోయింది.దీనికి తోడు విద్యుత్ (కరెంట్) పోయింది.

పర్వవసనంగా నగరం అంధకారమయం అయిపోయింది. దాదాపు రెండు గంటల నుంచే కరెంట్ లేక విజయనగర ప్రజలు అల్లాడిపోతున్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాన్స్ కో అధికారులు ఈదురు గాలులతో తెగిపోయిన విద్యుత్ తీగలను పునరుద్దరించే పనులు చేయడం ప్రారంభించారు.

Related posts

జనసేన లోకి పిల్లి సుభాష్ చంద్రబోస్?

Bhavani

కొత్త వాదం: స్టాలిన్ ‘సామాజిక న్యాయం’

Satyam NEWS

సిబ్బంది హాజరును అధికారులు పర్యవేక్షంచాలి

Bhavani

Leave a Comment