వేములవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది .జగిత్యాల జిల్లా మేడి పల్లి మండలం కేంద్రానికి చెందిన తూర్పాటి అంజి కొంతకాలంగా తన నివాసానికి సమీపంలో ఉన్న నేపాల్కు చెందిన , యువతి మాయ తో వివాహేతర సంభందం కొనసాగిస్తున్నాడు. అంజికి భార్య ఇద్దరు కుమారులు ఉండగా మాయ కు ఒక పాపా బాబు ఉన్నారు.మాయ భర్త అక్కడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నారు. వీరు ఇరువురు వారం రోజులుగా వేములవాడలోఓ ప్రైవేటు లాడ్జిలో ఉంటుండగా కుటుంబ సభ్యులు వెతుకుతూ రావడం తో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారని పోలీసులు తెలిపారు. చికిత్సకై సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.