తాను ఏరికోరి తెచ్చుకున్న తన రెండో భార్య తన స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్థాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ఆత్మహత్యకు రెండో భార్య, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కారణమని, వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. విశాఖ లో నివాసం వుంటున్న హరిప్రసాద్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి భువనేశ్వరి అనే మరో వివాహితను పెళ్ళి చేసుకున్నాడు.
కానీ ఆమె హరిప్రసాద్ స్నేహితుడు పెంకి రాజేష్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేక హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తన స్నేహితుడు భార్య చేసిన మోసాన్ని వీడియో ద్వారా రికార్డ్ చేసి వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మొదటి భార్యకు తనకు పుట్టిన బిడ్డను కాపాడాలని తనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని హరిప్రసాద్ వీడియో ద్వారా పోలీసులను కోరారు. తన మాజీ భర్త హరి ప్రసాద్ ప్రాణ స్నేహితుడు రాజేషే ఆత్మహత్యకు కారణమని హరిప్రసాద్ మొదటి భార్య వరలక్ష్మి ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తన భర్త హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసింది భువనేశ్వరి పెంకి రాజేష్ లే ని వరలక్ష్మి తెలిపింది. హరి ప్రసాదు ఆత్మహత్య చేసుకోబోయే ముందు వీడియో ద్వారా అతను మరణం వాంగ్మూలం తనకు పంపారని కూడా వరలక్ష్మి తెలిపింది.