మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్లో సి.ఐ ఛాంబర్లో హోంగార్డ్ ఎం.ఏ.గని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఇక్కడ సంచలనం సృష్టించింది. ఎం.ఎ.గని చర్లపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదులాబాద్ గ్రామంలో సర్వే నెంబర్ 258,268లో తన 30 గుంటల స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేశారని ఎం.ఏ.గని ఆవేదన వ్యక్తం చేశాడు. కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని గత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న హోంగార్డ్ ఎం.ఏ గని ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకోకవడంతో మనస్తాపానికి గురై హోంగార్డ్ ఎం.ఎ గని ఆత్మహత్యాయత్నం చేశాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
next post