28.7 C
Hyderabad
April 20, 2024 09: 10 AM
Slider గుంటూరు

Summer Alert: రెంటచింతలలో నిప్పుల వర్షం

#Rentachintala

రేపటి నుంచి ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ముప్పు ఉందని పేర్కొంది. గుంటూరు జిల్లా రెంట చింతల గత మూడు రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. నిన్న 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా  జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు  ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

Related posts

Hemp Cbd Oil Co2 Extract 3rd Party Tested

Bhavani

ఏపి మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యానికి మహర్దశ

Satyam NEWS

ప్రజల ఆకాంక్షను తీర్చని తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment