Slider సినిమా

ఎలర్ట్: సినీ నటుడు సునీల్‌కు అస్వస్థత

sunil

ప్రముఖ సినీ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ను గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హిట్టు కొట్టారు.

తొలుత హీరోగా మంచి విజయాల్ని అందుకున్న సునీల్‌.. తరువాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. దీంతో పంథా మార్చుకుని.. మళ్లీ హాస్య నటుడిగా అవతారమెత్తారు. కాగా హీరోగా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Related posts

ఉద్యోగులకు టీచర్లకు సంఘీభావంగా బిజెపి ఆందోళన రేపు

Satyam NEWS

బ్రుటల్ : 24 ఏళ్ల దళిత యువకుడికి నిప్పెట్టారు

Satyam NEWS

యూనియన్ బ్యాంకు లో బంగారం మాయం

mamatha

Leave a Comment

error: Content is protected !!