హైదరాబాద్ లోని చంపాపేట డివిజన్ సీనియర్ నాయకులు, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సుంకోజు కృష్ణమాచారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖాలకు చేరాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకాంక్షను వ్యక్తం చేశారు. కృష్ణమాచారికి శాలువ కప్పివ అభినందనలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నల్ల రఘుమరెడ్డి, మల్లేష్ గౌడ్, శేఖర్ రెడ్డి, అంజిరెడ్డి, నిష్కాంత్ రెడ్డి, శ్రీనాధ్, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.