24 C
Hyderabad
June 19, 2021 09: 18 AM
Slider సినిమా

వలస కూలీలకు సన్నీలియోన్ తన వంతు సాయం

#SunnyLeone

శృంగార తార సన్నీ లియోన్ తనదైన శైలిలో మానవత్వాన్ని ప్రదర్శించింది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను ఆదుకోవడానికి ఆమె తన వంతు సాయం అందిస్తున్నారు.

జంతుప్రేమికుల సంస్థ పెటాతో చేతులు కలిపిన సన్నీ లియోన్ వలస కూలీలకు పౌష్టికాహారం అందించేందుకు సిద్ధమయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీలో చిక్కుకుపోయిన వలస కూలీలకు ఉదయ్ ఫౌండేషన్ ద్వారా ఆమె పది వేల భోజనాలు ఇచ్చేందుకు నిర్ణయించారు.

అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో మనమంతా చిక్కుకుపోయి ఉన్నామని, అయితే దీన్నుంచి బయట పడతామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే అప్పటి వరకూ ఒకరికి ఒకరు సాయంగా ఉండాలని ఆమె కోరారు.

క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వలస కూలీలకు మరింత సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా సన్నీ లియోన్ తెలిపారు.

Related posts

కరోనా వైరస్ కట్టడిలో ప్రజలదే కీలక పాత్ర

Satyam NEWS

టార్గెట్ ఎంబసీ :అమెరికా దౌత్య కార్యాలయం లక్ష్యంగా దాడి

Satyam NEWS

రామాయపట్నం పోర్టు పనులపై వత్తిడి తేవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!