శవాన్ని కి వైద్యం చేసి 2 లక్షలు వసూలు చేసిన సంఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. హాయత్ నగర్ లోని సన్ రైస్ హాస్పిటల్ డాక్టర్లు ఈ దారుణానికి పాల్పడ్డట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా వైద్యం చేసినట్లు నటించడమే కాకుండా మరో రెండు లక్షలు ఇస్తే శవాన్ని అప్పగిస్తాం అంటూ ఆసుపత్రి యాజమాన్యం తమను బెదిరిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. 5 రోజుల క్రితం మధు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం కి పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యలు అదే రోజు అతనిని సన్ రైజ్ హాస్పిటల్ లో చేర్చారు. నిన్న మధు చనిపోయాడని అయితే తమకి సమాచారం ఇవ్వకుండా…డబ్బులు కట్టించుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు శవాన్నికూడా ఇవ్వడం లేదని వారు ఆరోపణ చేశారు.
previous post