31.2 C
Hyderabad
April 19, 2024 04: 51 AM
Slider ముఖ్యంశాలు

నేను మీ వాడ్ని కాదంటూ ఏడ్చిన కరోనా శవం

#SunshineHospital

కరోనా కారణంగా మృతి చెందిన మృతదేహాలను కుటుంబ సభ్యుల కు అప్పగించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు మృతుల కుటుంబ సభ్యులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది.

శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హన్మండ్లు 11 రోజుల క్రితం కోవిడ్-19 సోకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలు చేరారు.

పరిస్థితి విషమించడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతతో నిన్న రాత్రి హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రి లో అంకం హమ్మండ్లు మృతి చెందాడు.

శనివారం ఉదయం సన్ షైన్ దావఖాన అంబులెన్స్ గన్నారం గ్రామంలోని శవాన్ని స్మశాన వాటిక కు తరలించారు. ఈ నేపథ్యంలో చివరి చూపు  చూద్దాం అనుకున్న కుటుంబ సభ్యులు కట్టెలను పేర్చి శివాని కట్టెలపై ( కాష్టం) పడుకోబెట్టి ముఖంను చూడగా ఆ శవం గన్నారం గ్రామానికి చెందిన అంకం హన్మండ్లు కాదు.

దాంతో మధ్యలోనే అంత్యక్రియలు అలానే ఆపివేశారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు, కుటుంబీకులు హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహంతో ఉన్నారు.

అంకం హాన్మండ్లు మృతదేహం కాకుండా వేరే ఎవరిదో మృతదేహం పంపించడం ఏంటని సన్షైన్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికే అంకం హాన్మండ్లూ కు 15 లక్షల వరకు ఖర్చు అయిందని కానీ ప్రాణాలు మాత్రం దక్కలేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?

కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆర్థికంగా ఎటువంటి సాయం చేయకుండా కనీసం మృతదేహాలు మాత్రం ఎవరి కుటుంబాలకు చెందాయి అనే విషయాన్ని మర్చిపోతున్న ధోరణి కుటుంబాలు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణి ఎంతగా ఉందో మృతదేహాల తారుమారు చూస్తుంటేనే అర్థమవుతుందని స్థానికులు గ్రామస్తులు పేర్కొన్నారు.

అదేవిధంగా దీనికి ప్రభుత్వం ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇష్టానుసారంగా కరోనా బిల్లులను వేస్తూ లక్షల్లో బిల్లు అయితే మొత్తం బిల్లు కట్టి మృతదేహం తీసుకెళ్లండి  అనే పరిస్థితి నెలకొందని గన్నారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక తీరుగా చెప్పాలంటే ప్రైవేట్ ఆస్పత్రులకు అధికారులు, నాయకులు వత్తాసు పలకడమే అని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా కరోనా మృతదేహాలు తారు మారు అవుతున్నాయని గన్నారం గ్రామస్తులు పేర్కొన్నారు.

ప్రస్తుతం గన్నారం లో ఉన్న మృతదేహం, హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రి లో ఉన్న అంకం హన్నండ్లు మృత దేహంతో పాటు ఆస్పత్రి యాజమాన్యం ఈ గ్రామానికి రావాలని లేదంటే ప్రస్తుతం గన్నారం గ్రామంలో ఉన్న మృతదేహాన్ని మాత్రం ఎటు తీసుకెళ్లేది లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Related posts

అధిష్టానం జూపల్లి కి రెడ్ కార్పెట్ వేసిందా?

Satyam NEWS

‌ప్రైవేట్ టీచ‌ర్లకు భ‌రోసా కోస‌మే ధీక్ష‌

Sub Editor

జగన్ ప్రభుత్వం.. మైనార్టీ లకు ఏం చేసింది..?

Bhavani

Leave a Comment