28.7 C
Hyderabad
April 20, 2024 08: 04 AM
Slider ఆధ్యాత్మికం

నేడు ఆకాశంలో కనువిందు చేయనున్న పెద్ద చందమామ

srinivasa gargeya

తెలుగు సంవత్సరాది చైత్రమాసం వసంత ఋతువు ఉగాది అనంతరం వచ్చే పూర్ణిమ సందర్భంగా చంద్రుడు భూమికి దగ్గరగా రానుండడంతో మంగళవారం మహా జాబిలిగా వీక్షకులను కనువిందు చేయనుంది. ఈ మహా జాబిలికి జ్యోతిష్య పరంగా విశేష ప్రాధాన్యత ఉన్నట్లు ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య నిపుణులు పొన్నలూరి శ్రీనివాస గార్గేయ వెల్లడించారు.

సాధారణంగా భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. చందమామ సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్‌ అంటారు. మంగళవారం సూపర్ మూన్ మనల్ని అలరించనుంది.

నేడు పున్నమిరోజు కావడంతో చందమామ సూపర్‌మూన్‌గా కనిపించనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే.. ఆ రోజున కనిపించే చందమామను ‘సూపర్‌మూన్‌’ అని పిలుస్తారు.

ఉత్తర అమెరికాలాంటి ప్రాంతాల్లో ‘పింక్‌మూన్‌’ అని, ఇతర దేశాల్లో స్ర్పౌటింగ్‌ గ్రాస్‌ మూన్‌, ది ఎగ్‌ మూన్‌, ద ఫిష్‌మూన్‌ అని పిలుస్తుంటారు. శార్వరీ నామ సంత్సరం అధిపతి బుద్ధి కారకుడయిన బుధుడు కాగా మనః కారకుడైన చంద్రుడు మంత్రి కావడం విశేషం.

చైత్ర పూర్ణిమ సందర్భంగా చంద్రుడు పూర్ణ చంద్ర బలంతో మహా జాబిలిగా ప్రకృతి రాశి అయిన కన్యా రాశిలో కనువిందు చేయనున్నాడు.ఈ ఏడాది మంత్రిగా ఆధిపత్యం వహిస్తున్న చంద్రుడు, రాజుగా ఆధిపత్యం వహిస్తున్న బుధ గ్రహానికి చెందిన ప్రకృతి రాశి కన్యా రాశిలో స్వనక్షత్రం ‘హస్త’లో ఉండగా, రాహు గ్రహం బుధుడికి స్వక్షేత్రమయిన మిధున రాశిలో స్వనక్షత్రం ‘ఆరుద్ర’లోనూ, కేతువు ధనూరాశిలో స్వనక్షత్రం ‘మూల’ లోనూ ఉండడం అరుదైన విశేషం.

ఈఏడాది రాజుగా ఆధిపత్యం వహిస్తున్న బుద్ధి కారకుడైన బుధుడు నీచస్తానంలో  మీన రాశిలో ఎదురుగా కన్యా రాశిలో పూర్ణ చంద్రబలంతో ఉన్న మనః కారకుడైన చంద్రుడిని వీక్షించడం వలన విశ్వవ్యాప్తంగా పాలకులు విపత్కర పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోలేక పోతారని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనివాస గార్గేయ తెలిపారు.

చంద్రుడికి దక్షిణ బిందువు కేతువు, ఉత్తర బిందువు రాహువుల మధ్య మంత్రి చంద్రుడు ప్రకృతి రాశి లో ఉండి, మహా జాబిలిగా కనిపిస్తున్నప్పటికీ రాజు నీఛలో ఉండి, శని వీక్షణతో ఉన్నందున ప్రభుత్వ అధినేతలకు పరిపాలన కత్తి మీద సాముగా ఉన్నందున, ఖచ్చిత నిర్ణయాలను ఒక్కోసారి కఠినంగా తీసుకుంటారు.

ఆర్ధిక సంక్షోభం కన్నా ప్రజా సంక్షేమ మే మిన్నగా భావిస్తే లాక్ డౌన్ కొనసాగిస్తారు. అలా కాక ఆర్థిక స్థితే ప్రధాన మనుకుంటే ప్రజా సంక్షేమం దెబ్బతిని, ప్రస్తుత వైరస్ స్వైరవిహారం చేస్తుంది. ఇలాటి సమయంలో పాలకులకు ముందునుయ్యి, వెనుకగొయ్యి చందంగా నిర్ణయాలు తీసుకోలేక నిస్సహాయ స్థితిలో వుంటారు.

కనుక పాలకులకు సరైన రీతిలో సముచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలు వైరస్ బారిన పడకుండా , క్షేమ మార్గంలో ఉండేలా భగవంతుడిని ప్రతివారు మహాజాబిలి దర్శన సమయంలో జగన్మాత అనుగ్రహం పాలకుల తో పాటు ప్రజల కు కూడా తక్షణం ఉండాలని, ప్రజలంతా సమైక్యంగా నేటి రాత్రికి దర్శనమిచ్చే మహా జాబిలిని శారీరక దూరం పాటిస్తూ మహా జాబిలి దర్శనం చేసుకుని భగవతిని భక్తితో ప్రార్ధించడం శ్రేయోదాయకమని  గార్గేయ దైవజ్ఞలు వెల్లడించారు.

Related posts

ఒక్క డీజీపీ త‌ప్ప మిగిలిన వారెవ్వ‌రూ మాస్క్ ధ‌రింలేదు..!

Satyam NEWS

డిసెంబర్ 4న శ్రేయాస్ ఎటిటి ద్వారా “రాంగ్ గోపాల్ వర్మ” విడుదల

Satyam NEWS

పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు

Satyam NEWS

Leave a Comment