Slider కృష్ణ

ఏపిలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్

#doctor

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎంఇ ప‌రిధిలోని ఆసుప‌త్రుల సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో 128 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల‌కు వాకిన్ రిక్రూట్మెంట్ ప్రకటించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ సూర్య‌క‌ళ‌ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈనెల 16న ఉద‌యం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఓల్డ్ జిజిహెచ్ క్యాంప‌స్, హ‌నుమాన్ పేట‌, విజ‌య‌వాడ‌ డిఎంఇ కార్యాల‌యంలో వాకిన్ రిక్రూట్మెంట్‌ జరుగుతుంది.

డైరెక్ట్ రిక్రూట్మెంట్ మ‌రియు లేట‌ర‌ల్ ఎంట్రీ ద్వారా పోస్టుల భ‌ర్తీ చేయాలని నిర్ణయించారు. సి.టి స‌ర్జ‌రీలో 13, కార్డియాల‌జీలో 15, ఎండోక్రినాల‌జీలో 4, మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంటిరాల‌జీలో 6, మెడిక‌ల్ అంకాల‌జీలో 15, నియోనేటాల‌జీలో 1, నెఫ్రాల‌జీలో 17, న్యూరో స‌ర్జ‌రీలో 19, న్యూరాల‌జీలో 11, పెడియాట్రిక్ స‌ర్జ‌రీలో 3, ప్లాస్టిక్ స‌ర్జ‌రీలో 3, స‌ర్జిక‌ల్ అంకాల‌జీలో 12, యురాల‌జీలో 8, వాస్క్యుల‌ర్ స‌ర్జ‌రీలో 1 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల‌కు వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అర్హ‌త‌, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు https://dme.ap.nic.inhttps://dme.ap.nic.in/ మరియు https://apmsrb.ap.gov.in/msrb/. వెబ్ సైట్ల‌ను చూడొచ్చు.

Related posts

సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో కార్మిక జేఏసి

Sub Editor 2

భాగ్యనగర్ యువకులారా…. మజ్లిస్ సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

ఓ గాడ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
error: Content is protected !!