ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడిపై జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన అక్రమ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పనికిమాలిన పిటిషన్ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఒక్కమాట మాట్లాడిన భారీ జరిమానా విధిస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఈ పిటిషన్‍పై వాదించడానికి ఎలా వచ్చారని న్యాయవాది మహేంద్ర సింగ్‍ను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ఉచిత ఇసుక పాలసీ కారణంగా రాష్ట్ర ఖజానాకు గండి పడిందని జగన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టాడు. కంపెనీలు, దాని యాజమాన్యం క్రింద వచ్చే ఇన్సైడర్ ట్రేడింగ్ టెర్మినాలజీ వాడి సీఆర్‌డీఏ, రాజధాని విషయంలో మరొక కేసు పెట్టాడు. వెయ్యని ఇన్నర్ రింగు రోడ్డు, మాస్టర్‌ప్లాన్ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడి కొందరికి అనుచితంగా లబ్ధి చేకూర్చారని మరి కొన్ని కేసులు పెట్టాడు. ఇవి చాలవన్నట్టుగా అంతర్జాతీయ సీమెన్స్ కంపెనీ చక్కని స్కిల్ ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పెట్టించాడు. ఏపీ ఫైబర్‌నెట్ మీద ఒక కేసు పెట్టాడు. ఎసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగం అని సీఐడీతో కేసులు నమోదు చేయించాడు. ఆ కేసుల్లో ఏడింటిని సీబీఐకు అప్పగించాలంటూ పిటీషన్లు వెయ్యించాడు. ఆ పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.
previous post
next post