36.2 C
Hyderabad
April 25, 2024 22: 00 PM
Slider ప్రత్యేకం

ఏపిలో పరీక్షల నిర్వహణపై మండిపడ్డ సుప్రీంకోర్టు

#supreme court

పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరీక్షల నిర్వహణపై ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు.

ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు చెప్పడంతో సుప్రీంకోర్టు రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది.

11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు కేరళ తెలిపింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోని అసోం, పంజాబ్ త్రిపుర రాష్ట్రాలు నేడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ తాము పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి.

Related posts

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

Bhavani

కాంగ్రెస్ నేత ఆఫీసులో ఎన్నికల అధికారుల సోదాలు

Satyam NEWS

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కి మల్లురవి సంతాపం

Satyam NEWS

Leave a Comment