Slider సినిమా

కెఎల్ యులో ఘనంగా సురభి వేడుకలు

కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో గత రెండు రోజులుగా జరుగుతున్న సురభి-2025 వేడుకలు శనివారం నాడు ఘనంగా ముగిశాయి. తొలుత జరిగిన కార్యక్రమంలో బాగంగా మ్యాడ్ స్వ్కేర్ చిత్ర బృందం, లైఫ్ చిత్రాల బృందాలు సందడి చేశాయి. మ్యాడ్ స్వ్కేర్ సినిమా హీరో నరేన్ నితిన్, హీరోయిన్ ప్రియాంకా జ్వాలాకర్,సినిమా నిర్మాత హారిక, లైఫ్ సినిమా హీరో శ్రీహర్ష, తండ్రి పాత్ర చేసిన ఎస్ పి చరణ్, సినిమా డైరెక్టర్ పవన్ లు విద్యార్దులతో ముచ్చటించి అలరించారు.

ప్రముఖ సినీ గాయకుడు, లైఫ్ సినిమా లో తండ్రి పాత్ర చేసిన ఎస్ పి చరణ్ మాట్లాడుతూ కుటుంబ కథతో చిత్రంగా తెరకెక్కిన లైఫ్ సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చునని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న ఈ చిత్రంలో కళాశాలలో చదువుతున్న కొడుకుతో తండ్రికి ఉండే అనుబందాన్ని ప్రత్యేక కోణంలో చూపారని అన్నారు.

మ్యాడ్ స్వ్కేర్ సినిమా హీరోలు రామ్, నరేన్ నితిన్, హీరోయిన్ ప్రియాంకా జ్వాలాకర్ లు మాట్లాడుతూ తాము నటించిన మొదటి సినిమా మ్యాడ్ -1 సినిమా ను ప్రేక్షకులు ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 28న విడుదల కానున్న మ్యాడ్ స్వ్కేర్ -2 సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. సినిమా నిర్మాత హారిక మాట్లాడుతూ విద్యార్దుల పరీక్షల కారణంగా సినిమా విడుదలను ఈ నెల 28 వరకు ఆపినట్లు తెలిపారు. హాస్యంతో నిండిన మ్యాడ్ స్వ్కేర్ -2 సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

శనివారం నాడు ముఖ్య అతిథిగా హాజరయిన మిస్సెస్ ఆసియా రితిక వినయ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ది సాదిస్తున్నారని అన్నారు. విద్యా, ఉద్యోగాలలో మహిళలదే పై చేయి అని తెలిపారు. పురుషుల దీటుగా పోటీ పడుతున్న మహిళలందరికీ ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మరో ముఖ్య అతిథిగా హాజరయిన ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ నర్రా మాట్లాడుతూ కెఎల్ వర్శిటీలో వంద శాతం ఉద్యోగాల కల్పన విద్యార్దినీ, విద్యార్దులను ప్రయోజకులను చేయడమేనన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను అభ్యసించే వారికి మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.

తెలుగు చలన చిత్ర దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూ ఏ విద్యార్ది అయినా పది వేల గంటల పాటు నిర్విరామంగా ఒకే కళపైన సాధన చేస్తే ఆ కళలో వారు నిపుణులు అవుతారని సూచించారు.
కెఎల్ వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ మాట్లాడుతూ కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వడ్డేశ్వరం లోని గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లో శుక్ర, శని వారాలు జరగుతున్న జాతీయ స్థాయి సురబి వేడుకలకు దేశ వ్యాప్తంగా ఆయా యూనివర్శిటీలు, కళాశాలలకు చెందిని విద్యార్దినీ, విద్యార్దులు తమ పేరులను నమోదు చేసుకుని ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తమ వర్శిటీలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ లో సుమారు 43 క్లబ్ లు ఉన్నాయన్నారు. ఆ క్లబ్ ల ద్వారా విద్యార్దులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు విద్యార్దులతో వినూత్న ప్రయోగాలను చేయిస్తున్నామన్నారు.

స్మార్ట్ విలేజ్ వంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్దులు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పలు రకాల సమస్యలకు టెక్నాలజీని జోడించి పరిష్కారాలు తమ విద్యార్దులు చూపుతున్నారని అన్నారు. రానున్న కాలంలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం 2023-2024 విద్యా సంవత్సరంలో చదువులో, క్రీడల్లో, ఎన్ సిసి, ఎన్ ఎస్ఎస్ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్దులకు, ఉత్తమ అద్యాపకులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు, ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, సురబి చైర్ పర్సన్ డాక్టర్ కెఆర్ఎస్.ప్రసాద్, డాక్టర్ హబీబుల్లా ఖాన్, కన్వీనర్లు పి. సాయి విజయ్, డాక్టర్ ఎం.సుమన్, డాక్టర్ వి. కృష్ణా రెడ్డి అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

సేవ్ నల్లమల్ల నినాదంతో కదం తొక్కుతున్న యువత

Satyam NEWS

రంజాన్ కు మైనారిటీ హక్కుల సమితి సూచనలు

Satyam NEWS

కడప జిల్లాలో సంపూర్ణంగా భారత్ బంద్

Satyam NEWS

Leave a Comment