బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రైమరీ పాఠశాలలో మంగళవారం మానిటరింగ్ అధికారి కాంప్లెక్స్ హెచ్ఎం కిషోర్ పర్యవేక్షించారు. విద్యార్థుల రికార్డులు, హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన రిజిస్టర్లు, స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా స్వయం మూల్యాంకన విద్యార్థులకు కచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా తనిఖీ చేశారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంతో కూడుకున్న భోజనాన్ని వండి వడ్డించాలని ప్రతి ఒక్క విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి విద్యాబోధన చేయాలని ప్రధాన ఉపాధ్యాయురాలు రానా తబస్సుమ్ కు సూచించారు. విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.