39.2 C
Hyderabad
April 25, 2024 17: 07 PM
Slider పశ్చిమగోదావరి

విద్యార్ధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి

#mpdo

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం  మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఎం పి డి ఓ జి రాజమనోజ్   బుధవారం సందర్శించారు.  ఈ సందర్శనలో పాఠశాల  హెచ్ ఎం  తీసుకుంటున్న కొన్ని సొంత నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో కొన్ని తరగతి గదులు పగటి పూట వాతావరణ కారణం గానో పాఠశాలచుట్టూ ప్రహరీ ఉన్న కారణంతోనో తరగతి గదులు చీకటిగా ఉండటం విద్యార్థులు తమ కళ్ళకు కావాల్సినంత వెలుతురు లేకపోతే కంటి చూపు విద్యార్థి దశలోనే కోల్పోయే ప్రమాదం ఉందని ఎం పి డి ఓ గమనించారు.

తరగతి గదులలో విద్యుత్ బల్బ్ లున్నప్పటికి వాటిని ఉపయోగిస్తే విద్యుత్ బిల్ ఎక్కువ వస్తుందని లైట్లు వెలిగించలేదని హెచ్ ఎం చెప్పడం బాధాకరమని  ఎం పి డి ఓ రాజ్ మనోజ్ హెచ్ ఎం ని సున్నితంగా మందలించారు. తరగతి గదులలో విద్యార్థులకు సరిపడా బెంచి బల్లలులేక కొంతమంది విద్యార్థులు నెలపైనే కూర్చుంటున్న పరిస్థితి  ఎం పి డి ఓ గమనించారు. అదే పాఠశాల ఆవరణలో భవన నిర్మాణ మెటీరియల్ అస్తవ్యస్తంగా ఉన్నాయని వాటిని వెంటనే తీసి వేయించాలి  ఎం పి డి ఓ  ఆదేశించారు.

అదే గ్రామం లో చెత్త నుండి సంపద సృష్టించే షెడ్ ని ఎం పి డి ఓ పరిశీలించారు. ఇదే గ్రామంలో నిర్మితమౌతున్న గ్రామ సచివాలయ.రైతు భరోసా, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు నిర్మించే సైట్ ను పరిశీలించి నిర్మాణ పనులు వేగంగా జరగాలని సంబంధిత సిబ్బందిని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ ఆదేశించారు.

Related posts

డెంగ్యూ తో మహిళా న్యాయమూర్తి మృతి

Satyam NEWS

నిన్న ఉత్తమ ఉద్యోగి – నేడు లంచగొండి

Satyam NEWS

బ్లాక్ లిస్ట్:వెస్ట్‌ బ్యాంక్‌లో 112 కంపెనీలపై నిషేధం

Satyam NEWS

Leave a Comment