27.7 C
Hyderabad
March 29, 2024 01: 23 AM
Slider విజయనగరం

వ‌రుస‌గా స్టేష‌న్ల ను త‌నిఖీ చేస్తున్న విజయనగరం జిల్లా ఎస్పీ

#vijayanagaram police

తాజాగా విజ‌య‌న‌గ‌రం స‌ర్కిల్ ప‌రిధిలో గంట్యాడ పీఎస్ సంద‌ర్శ‌న‌….!

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ఈ నెల 12 న కొత్త ఎస్పీగా చార్జ్ తీసుకున్న దీపికా పాటిల్…ఆకస్మిక త‌నిఖీల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇటీవ‌లే నాలుగు పోలీస్ స్టేష‌న్  ల‌ను త‌నిఖీ చేసిన ఎస్పీ..తాజాగా విజ‌య‌న‌గ‌రం స‌ర్కిల్ ప‌రిధి గంట్యాడ పోలీస్ స్టేష‌న్ ను ప‌రిశీలించారు.

సాయంత్రం మూడు గంట‌ల ప్రాంతంలోన‌గ‌రంలోని పోలీస్ గెస్ట్ హౌస్ నుంచీ నేరుగా గంట్యాడ పీఎస్ కు వెళ్లారు. అదీ డీఎస్పీ అనిల్ కుమార్ , సీఐ మంగ‌వేణిల‌ను వెంట పెట్టుకుని మరీ స్టేష‌న్ ను ఆకస్మికంగా త‌నిఖీ చేసారు.

ఈ మేర‌కు స్టేష‌న్ ఎస్ఐ కిర‌ణ్ కుమార్…ఎఫ్ఐఆర్ ద‌గ్గర నుంచీ, జీడీ ఎంట్రీ , ప‌లు కేసుల రికార్డులు,దొంగ‌త‌నం రిక‌వ‌రీలు, హ‌త్య కేసుల ప‌రిశోధ‌న‌,ప్రొప‌ర్టీ అఫెన్స్ వంటి వివ‌రాలు…స్టేష‌న్ ల‌లో న‌మోదవుతున్న వాటిని ద‌గ్గ‌రుండీ చూపించారు.

ఇదిలా ఉంటే స్టేష‌న్ లో అడుగుపెడుతూనే ఎస్పీ దీపికా పాటిల్..ప్రొపర్టీ ఐడెంటిఫికేష‌న్ నెంబ‌ర్(పిన్ )ల‌కు సంబంధించి ఆరా తీసారు.  దీంతో డీఎస్పీ అనిల్ ముందుగానే పిన్ ల‌పై అవగాహ‌న ఉండ‌టంతో…త‌న ప‌రిధిలో అన్ని వెహిక‌ల్స్ కు పిన్ లు అటాచ్ చే్స్తున్న‌ట్టు చెప్పారు.

దీంతో ఇంతవ‌ర‌కు ఆరు పీఎస్ ల‌ను  ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఎస్పీ దీపికా పాటిల్  కు ఆయా  స్టేష‌న్ ల‌లో ఒక్క రిమార్క్ లేకుండా సిబ్బంది విధులు నిర్వ‌హిస్తుండ‌టం  చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. రిసెప్షన్, పోలీసు స్టేషను రికార్డులను పరిశీలించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, దిశా యాప్ పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సంద‌ర్బంగా డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో యావ‌త్ స్టేష‌న్ సిబ్బందిని ఎస్పీ ప్ర‌శంసించారు.ఈ ఆక‌స్మిక త‌నిఖీలో డీఎస్పీఅనిల్ తో పాటు సీఐ మంగ‌వేణి,ఎస్ఐ కిర‌ణ్ స్టేష‌న్ సిబ్బంది ఉన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

నేటి నుండి మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణి

Satyam NEWS

సూర్యాపేట జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్

Bhavani

Leave a Comment