39.2 C
Hyderabad
April 23, 2024 16: 52 PM
Slider విజయనగరం

నిస్వార్ధంగా పని చేస్తే  చిర స్థాయిగా నిలిచిపోతారు

#vijayanagaram district

కొత్త గా ఎన్నికైన  విజయనగరం డివిజిన్ సర్పంచ్ ల శిక్షణా కార్యక్రమం నగరంలో ని జే.ఎన్.టి.యు లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ఎంతో నమ్మకం, విశ్వాసం తో  ఎన్నుకున్న ప్రజల ఆశయాలకు అనుగుణంగా  సర్పంచ్ లు పని  చేయాలని  అన్నారు.   నిస్వార్ధంగా ప్రజల కోసం పని చేస్తే  ప్రజల మనసుల్లో  చిర స్థాయిగా నిలిచిపోతారని  అన్నారు. పార్టీలకతీతంగా, అంకిత  భావం తో పని చేసి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని అన్నారు. 

సంక్షేమం లో మన జిల్లా అన్ని వేళలా ముందున్నదని, గ్రామాల్లో అర్హులైన వారికి సంక్షేమ పధకాలను పారదర్శకంగా అందిస్తూ  మన స్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. 

గ్రామాల్లో చెట్లను విరివిగా నాటాలని,  చెరువు శుద్ధి కార్యక్రమాలను చేపట్టాలని,  స్వచ్చమైన గాలి, వాతావరణాన్ని కల్పించి గ్రామాలూ ఆహ్లాదంగా ఉండేలా చూడాలని అన్నారు.  కరోనా పూర్తిగా పోలేదని గుర్తుంచుకొని, కరోన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలన్నారు. వాక్సినేషన్ వలన  కరోనా మరణాలను  నివారించ వచ్చని , అందరికీ వాక్సినేషన్ వేసేలా బాధ్యత సర్పంచ్ లు స్వీకరించాలని  అన్నారు.

గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మాట్లాడుతూ  సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు పరిపాలన లో భాగస్వాములను చేసారని,   ఎన్నికైన మహిళలే  గ్రామ పాలనను  చేపట్టాలని అన్నారు. 

అందుకు ఈ శిక్షణ చాల ఉపయోగపడుతుందని, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు విధి విధానాల పై ప్రభుత్వ సంక్షేమ పధకాల పై పూర్తిగా అవగాహన కల్పించుకోవలన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సర్పంచ్ లతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.  సర్పంచ్ లు వారి హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. 

గ్రామాల్లో అభివృద్ధి పధకాలను చేస్తేనే శాసన సభ్యులుగా మాకూ గుర్తింపు వస్తుందని తెలిపారు.  అర్హులందరికీ సంక్షేమ పధకాలు  అందేలా చూడాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేస్తూ  గ్రామాలలో ఉత్తమ పాలన అందించాలని అన్నారు.

దేశానికి  రాష్ట్రపతి లా గ్రామానికి సర్పంచ్ వ్యవహరించాలని  కోలగట్ల  వీర భద్ర స్వామి మాట్లాడుతూ   గ్రామాలలో  సర్పంచ్ పని తీరును బట్టి  వారి మాటకు విలువ ఉంటుందని,  దేశం లో రాష్ట్ర పతి కి ఎంత విలువ ఉంటుందో గ్రామం లో సర్పంచ్ కి అంతే ఉంటుందని అన్నారు.  వారి గౌరవాన్ని పెంచుకునేల సర్పంచ్ లు పని చేయాలనీ అన్నారు.

ముఖ్యమంత్రి గ్రామ పాలనకు శ్రీకారం చుట్టి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసారన్నారు  ప్రజల ముంగిటకే పాలనను తీసుకు వచ్చారని, దీనిని సర్పంచ్ లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.   పది మందికి మేలు చేసే అవకాశాన్ని ప్రజలు, భగవంతుడు ఇచ్చారని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. 

గ్రామాలలో ఉండే రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, సచివాలయాలను,  పర్వేక్షించాలని, గ్రామ  పాలనలో సర్పంచ్ పదవి కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో  సంయుక్త  కలెక్టర్  డా. జి.సి.కిషోర్ కుమార్, కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి,    ఆర్.డి.ఓ భవాని శంకర్,  జిల్లా పంచాయతి అధికారి సుభాషిణి,  డిప్యూటీ సి.ఈ.ఓ రామ చంద్ర రావు, తహసిల్దార్ ప్రభాకర రావు,   గజపతినగరం , బొండపల్లి, గంట్యాడ మండలాల సర్పంచ్ లు పాల్గొన్నారు. అనంతరం  సర్పంచ్ ల  శిక్షణా కర దీపికలను, కరోనా పోస్టర్ల  ను, కర పత్రాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Related posts

యువగళం సభతో ఉలిక్కిపడ్డ తాడేపల్లి ప్యాలెస్‌

Satyam NEWS

మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణల్లో కుట్ర కోణం

Satyam NEWS

రాజంపేటలో వైసీపీ జాబ్ మేళా….

Bhavani

Leave a Comment