37.2 C
Hyderabad
April 19, 2024 11: 26 AM
Slider వరంగల్

జాతీయ సాధన సర్వే మొదలయింది

ములుగు జిల్లా లో మూడవ తరగతి విద్యార్థులకు పునాది అభ్యసన అధ్యయనం 2022 లో జాతీయ సాధన సర్వే నేటి నుండి ప్రారంభం అయింది అని డీఈఓ పానిని తెలిపారు. ఈరోజు, రేపు జిల్లాలోని మొత్తం ఏడు పాఠశాలలలో ఈ సర్వే నిర్వహించబడుతుంది అందులో నాలుగు తెలుగు మీడియం, 3 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వాజేడు మండలం టేకులగూడెం, మంగపేట కోమటిపల్లి, ఏటూర్ నాగారం మండలం ఏటూర్ నాగారం ప్రాథమిక పాఠశాల, ములుగు మండలంలోని అరవింద విద్యానికేతన్ లలో సర్వే నిర్వహించబడింది. ఈ సర్వేలో మొత్తం 36 మంది విద్యార్థులను ప్రభుత్వ డైట్ కళాశాల హనంకొండ నుంచి వచ్చిన విద్యార్థులు పరీక్షించారు. మిగతా మూడు పాఠశాలలు ములుగు మండలం లోని సిఎస్ఐ ఎయిడెడ్ ములుగు, తాడ్వాయి మండలంలోని కాటా పూర్, ఏటూర్ నాగారం మండలం లోని శంకర్ రాజు పల్లి పాఠశాలలో సర్వే నిర్వహించబడును.

Related posts

రాజకీయ, ఆర్థిక సంక్షోభం… విశ్వవ్యాప్తంగా అలజడి

Bhavani

వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ

Satyam NEWS

పైడిత‌ల్లి ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ఆర్డీవో స‌మీక్ష‌

Satyam NEWS

Leave a Comment