26.2 C
Hyderabad
March 26, 2023 12: 01 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

సుష్మా మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

pjimage (4)

మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. వివిధ హోదాల్లో సుష్మా స్వరాజ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుష్మా స్వరాజ్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సుష్మా స్వరాజ్ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె లోకసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

Related posts

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు పై నిర్భయ కేసు

Satyam NEWS

ఫర్ సేల్: కామారెడ్డి కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి

Satyam NEWS

డ్యూటీ మీట్ లో పతకాలు సాధించినవారికి అభినందన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!