29.7 C
Hyderabad
April 18, 2024 03: 09 AM
Slider జాతీయం

కన్నీళ్లు పెట్టుకొన్న ప్రధాని మోడీ

emotional-modi

మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు నివాళులర్పించారు.  సుష్మాస్వరాజ్ పార్థీవదేహం వద్ద ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకొన్నారు. సుష్మాస్వరాజ్ ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి మోడీ కుటుంబసభ్యులను ఓదార్చారు. సుష్మా స్వరాజ్ పార్థీవదేహం వైపు తదేకంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకొన్నారు. మరోవైపు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు  రాష్ట్రపతి కోవింద్ , ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులు ఆమె పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మతో తమకు ఉన్న అనుబంధాన్ని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. మాజీ కేంద్ర మంత్రి అద్వానీ కూడ సుష్మాస్వరాజ్ పార్ధీవ దేహం వద్ద భావోద్వేగానికి గురయ్యారు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో అద్వానీ, సుష్మాస్వరాజ్ మంత్రులుగా పనిచేశారు.

Related posts

రానున్ననాలుగైదు రోజులు భారీ వర్షాలు

Satyam NEWS

మైక్రో సాఫ్ట్ చైర్మన్ గా సత్య నాదెండ్ల

Satyam NEWS

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

Bhavani

Leave a Comment