ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృధ్వీరాజ్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ముఖ్యమంత్రిని కలిసి తనను చైర్మన్‌గా నియమించడం పట్ల కృతఙ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్వీబీసీ చానల్ ను ప్రారంభించి భక్తులకు అనేక సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్వీబీసీని మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్ తెలిపారు.
previous post
next post