ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలో కూడా రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ ఉండడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల ప్రకారం కడప జిల్లా శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంను మూసివేస్తున్నారు. ఈవో మహేశ్వర్ రెడ్డి తో చర్చించి శనివారం, ఆదివారం దేవాలయాన్ని మూసి వేయాలని నిర్ణయించినట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తిరిగి సోమవారం ఆలయాన్ని తెరుస్తాం అని ఆయన తెలియజేశారు. అయితే భక్తులకు దర్శనం చేసుకునే వీలు మాత్రమే కల్పిస్తామని ఆయన అన్నారు. 9 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు చేసేందుకు భక్తులకు అనుమతి ఇవ్వబోమని ఆయన అన్నారు. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని శ్రద్ధతో గమనించాలని ఆయన తెలియజేశారు.
previous post