నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఆరుద్రోత్సవం సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారు స్వర్ణ రధం పై ఆలయ మాడవీధులలో విహరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. రథోత్సవంలో పలు కళారూపాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
previous post