27.7 C
Hyderabad
April 25, 2024 10: 46 AM
Slider ప్రత్యేకం

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రకు కోపం వచ్చింది

#saradanandaswamy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజగురువు అయిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర కు కోపం వచ్చింది. నిజంగానే రాజగురువుకు కోపం వచ్చింది. ప్రభుత్వం పనితీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతర్గత కలహాలతో అధికారులు దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారని స్వరూపానందేంద్ర తీవ్రంగా ఆరోపించారు.

వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారని, పెరుగుతున్న భూవివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమైనా ఉపయోగించుకోవడం లేదని ఆయన అన్నారు. దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని, 12 ఏళ్ళుగా దేవాదాయ శాఖలో సిబ్బంది ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమని స్వరూపానందేంద్ర అన్నారు.

కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి రావాలని, అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్వరూపానందేంద్ర ప్రకటించారు. సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఎంతో ఆవేశంగా ప్రసంగించారు.

Related posts

నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం

Satyam NEWS

స్టూడెంట్స్ సేఫ్:స్కూల్‌ బస్సు బోల్తా 20 మందికి గాయాలు

Satyam NEWS

మరో మూడు రోజుల పాటు ముసురే

Satyam NEWS

Leave a Comment