23.2 C
Hyderabad
November 29, 2021 16: 37 PM
Slider ముఖ్యంశాలు

అవార్డు రావడంతో మరింత బాధ్యత : చైర్‌పర్సన్ ముల్లి పావని

#mullipavani

అవార్డు రావడంతో ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలపై ఇంకా బాధ్యత పెరిగిందని చైర్‌పర్సన్ ముల్లి పావని పేర్కొన్నారు. బుధవారం ఘట్కేసర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం ఘట్ కేసర్ మున్సిపాలిటీకి స్వచ్ సర్వేక్షన్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ అవార్డ్ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి సి హెచ్ మాల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిల సహకారంతో పారిశుద్ధ్య కార్మికుల శ్రమకు తగిన అవార్డు రావడం ఘట్కేసర్ మున్సిపాలిటీకి, ఘట్కేసర్ మున్సిపల్ ప్రజలకు గౌరవం దక్కిందని అన్నారు. అంతే కాకుండా అవార్డు రావడంతో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  అభినందించారని పేర్కొన్నారు. 

అనంతరం చైర్‌పర్సన్ ముల్లి పావని మంత్రి కేటీఆర్ తో ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వివరించినట్లు తెలిపారు. ఘట్కేసర్, కొండాపూర్, బోగరం ప్రజలకు ఉన్న రైల్వే బ్రిడ్జి సమస్యను కేటీఆర్ కు వివరించగా కేటీఆర్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు ఆగిపోయిందని అడిగినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ఇండ్లు కోల్పోయిన బాధితులకు 60 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ చేసి ఇవ్వకపోవడంతో ప్రజలు కోర్టును ఆశ్రయించారని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నారని, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గేట్ పడటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా రైల్వే గేట్ వేయడంతో చాలా వాహనాలలు జామ్ అవడంతో అంబులెన్స్ లు వెళ్లకుండా ఉండటంతో కొంతమంది ప్రాణాలు సైతం పోవడం చాలా బాధాకరంగా ఉందని ఘట్ కేసర్ ప్రజలకు  ప్రధాన సమస్యగా ఉందని  కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం కింద 145 మంది కుటుంబాలకు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందిగా కోరడంతో సానుకూలంగా స్పందించిన కేటీఆర్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం నాతో కలిసి పని చేస్తున్న మునిసిపల్ కమిషనర్ కు, వైస్ చైర్మన్ కు, తోటి కౌన్సిలర్లకు, కో ఆప్షన్  సభ్యులకు, మునిసిపల్ అధికారులకు, ఘట్ కేసర్ మునిసిపల్ పట్టణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

సత్యం న్యూస్, శేరిలింగంపల్లి

Related posts

మోజో టివి సిబ్బందికి తీరని మోసం

Satyam NEWS

పుణ్య క్షేత్రం శ్రీ మైసమ్మ దేవత ఆలయం మూసివేత

Satyam NEWS

కటీ పతంగ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!