27.7 C
Hyderabad
April 24, 2024 10: 16 AM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం అమలు

#swtchhyderabad

స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని అధికారులు అమలు చేయాలని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు. అధికారులు తీసుకునే చర్యలతో బాటు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు డివిజన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఆలీకేప్ చౌరస్తా నుండి గోల్నాక చౌరస్తా రోడ్డు వరకు స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.

డివిజన్ అభివృద్ధి, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. గోల్నాక డివిజన్లోని ఎస్.ఎఫ్.ఎ.లతో గోల్నాక డివిజన్లోని ప్రతి బస్తి, కాలనీలలో డివైడర్ లకు, బస్తీలలో చెత్త చెదారం పేరుకుపోయి ప్రజలు దుర్వాసన  భరించలేక పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల పాటు గ్యాంగ్ వర్క్ తో ప్రతి బస్తీ కాలనీలో శుభ్రంగా ఉంచాలని అధికారులకు, పారిశుధ్య కార్మికులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.యస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్.కే.బాబు, నర్సింగ్ యాదవ్, అబ్బు,రాజు, ఉమేష్, ప్రణీత్, ఎస్ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్యాలెస్ క్లోస్డ్:దలైలామా అధికారిక నివాసం మూసివేత

Satyam NEWS

ఆశా కార్యకర్తల మహాధర్నాకు ముందస్తు అరెస్టులు

Satyam NEWS

గోమాతకు గ్రాసం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment