ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానుల్లో సైరాను మించిన మేనియా మరోకటి లేదు. ఎక్కడ చూసిన సైరా ఫీవర్ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 4300 థియేటర్స్ లో విడుదలవుతూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మెగాస్టార్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీ గవర్నమెంట్ ఈ సినిమాకు రోజుకు 6 షోలు వేసుకునే అనుమతి ఇచ్చింది. నిజానికి తెలంగాణలో కూడా ఆరు షోల కోసం ప్రయత్నించినా ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి రాలేదు. సైరా బడ్జెట్, దసరా హాలీడేస్ సందర్భంగా ఈ చిత్రానికి 6 షోలు వేసుకుంటే మంచిదని భావించిన దర్శక నిర్మాతలు గవర్నమెంట్ ని పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి జగన్ సర్కార్ కూడా సానుకూలంగానే స్పందించారు. రోజుకు 6 షోలకు అనుమతి రావడంతో సైరా పాజిటివ్ టాక్ తో రికార్డులు బద్ధలైపోవడం ఖాయం
previous post
next post