మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నదనుకుంటున్న సమయంలో పైరసీ వెర్షన్ బయటకు వచ్చింది. తమిల్ రాకర్స్ అనే వెబ్ సైట్ ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చేయడంతో ఫిలిమ్ యూనిట్ తీవ్ర ఆందోళనలో ఉంది. చిత్రం పూర్తి వెర్షన్ ను ఆ వెబ్ సైట్ రిలీజ్ చేసేసిందనే సమాచారం అందింది. అయితే తమిళ్ వర్షన్ ఒక్కటే లీక్ అయిందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సైరా నరసింహారెడ్డి చిత్రం పాజిటీవ్ టాక్ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. చిత్రం బాగుందనే టాక్ వినిపిస్తుండటంతో కలెక్షన్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. చాలా కేంద్రాలలో ఆరు షోలను ప్రదర్శిస్తూ సైరా చిత్రం కలెక్షన్లలో దూసుకువెళుతున్నది. ఈ దశలో పైరసీ వెర్షన్ విడుదల కావడం ఆందోళన కలిగిస్తున్నది.
previous post
next post