Slider ఆంధ్రప్రదేశ్ సినిమా

వైసిపిలోకి జెంప్ కాబోతున్న తిక్కవరపు

subbi

రాజకీయ సినీ రంగాలలో విశేష అనుభవం ఉన్న టి.సుబ్బరామిరెడ్డి ఇక వైసిపిలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న ఆయన ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బతికే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆయన నిర్ణయం తీసుకున్నారు అనేదాని కన్నా విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సలహా ఇచ్చి వైసిపిలో చేర్పిస్తున్నారంటే కరెక్టుగా ఉంటుంది. విశాఖ శారదా పీఠానికి సుబ్బరామిరెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఇటీవల స్వామిని కలిసినపుడు ఆయన ఈ సలహా ఇచ్చారు. దాంతో ఇలాంటి విషయాలలో అపారమైన నమ్మకం విశ్వాసం ఉన్న టి.సుబ్బరామిరెడ్డి తర్వలో వైసిపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. సుబ్బరామిరెడ్డిని చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముందుగా విముఖత వ్యక్తం చేసినా ఆ తర్వాత స్వామీజీ ఆశీస్సులు ఉండటంతో ఆయన కూడా అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీ లాబీలో వైసీపీ దారుణంగా విఫలం అవుతున్నది. తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరి మళ్లీ అధికార పీఠంలో తిష్టవేసిన సుజనాచౌదరిని ఎదుర్కొనడం ఢిల్లీలో వైసిపికి సాధ్యం కావడం లేదు. సుబ్బరామిరెడ్డి చేరితే ఢిల్లీలో విశేష పలుకుబడి ఉన్నందున ఆ లోటు తీరవచ్చునని భావిస్తున్నారు

Related posts

సీఎం గారూ 1998 డీఎస్సీ అభ్యర్థుల మొర ఆలకించండి

Satyam NEWS

నెల్లూరు మహిళలూ ఈ నెంబర్లు గుర్తు పెట్టుకోండి

Satyam NEWS

జగన్‌ మేనమామకి ఝలక్‌..!!

Satyam NEWS

Leave a Comment