22.7 C
Hyderabad
February 14, 2025 01: 34 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఓల్డ్ స్టైల్ :తిరుపతిలో అద్దెగదులకు ‘క్యాష్ ఆన్ డిపాజిట్’

t td rooms new

తిరుమల తిరుపతి దేవస్థానము అద్దె గదులకు సంబంధించి గతం లో ఉన్న విధానాన్నేతిరిగి టిటిడి అమలు చేయబోతుంది.దీనితో వెంకన్నను దర్శించుకోవాలనుకున్నపేదవారికి డిపాజిట్ రూపంలో మరికొంత డబ్బు అవసరమవుతుంది.

తీరుమలలో అద్దె గదుల బుకింగ్ విధానంలో మార్పులను చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ‘క్యాష్ ఆన్ డిపాజిట్’ విధానం అమలు చేయనున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ మాధ్యమంలో రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది.గదిని ఖాళీ చేసిన తరువాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.

ఆఫ్ లైన్ లో , తిరుమలకు వచ్చి, అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్ నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానం అమలైంది. కాగా ఈవిధానం ఎందుకు అమలు చేస్తున్నామో అన్న విషయమై టిటిడి వివరణ ఇవ్వలేదు.

Related posts

అక్రమ దందాలు సాగిస్తున్న  విలేకర్లు అరెస్టు

Satyam NEWS

అమరవీరుల సాక్షిగా వర్గీకరణ సాధించుకొని తీరుతాం

Satyam NEWS

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS

Leave a Comment