30.7 C
Hyderabad
April 24, 2024 00: 46 AM
Slider జాతీయం

తబ్లిగీ జమాత్ వాళ్లు ఎలాంటి నేరం చేయలేదు

#TabligiJamat

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని అరోపణలు ఎదుర్కొంటున్న 20 మంది విదేశీ ముస్లింలను ముంబయి కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఇండోనేసియాకు చెందిన 10 మంది, పూర్వ రష్యాలోని క్వైర్ గజ్ రిపబ్లిక్ కు చెందిన మరో 10 మంది తబ్లిగి జమాత్ కు వెళ్లి అక్కడ నుంచి ముంబయిలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు.

వారంతా వివిధ ప్రాంతాలలో పర్యటించి అక్కడి స్థానికులను కలిశారు. వీరు ఇలా చేయడం వల్లే కరోనా వైరస్ వ్యాపించిందని ఆరోపిస్తూ అంధేరీ పోలీసులు కేసులు పెట్టారు.

ఈ కేసులను విచారించిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ ఆర్ ఖాన్ వారందిరిని నిర్దోషులుగా ప్రకటించారు. నిబంధనల మేరకు పాస్ పోర్టు వీసా కలిగి ఉన్న ముస్లింలు ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కు హాజరయ్యారని, ఆ తర్వాత వారు ముంబయిలోని నూర్ మసీద్ ను, జమాత్ ఖానా, అంధేరీ వెస్ట్ తదితర ప్రాంతాలకు వచ్చి అక్కడ ఎంతో మందిని కలిశారని ఆరోపణ.

కాగా వారు ఎవరూ కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని స్థానిక సాక్ష్యులు తెలిపారు. దాంతో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.  

Related posts

సినీ నటుడు రాజీవ్ కనకాల సోదరి మృతి

Satyam NEWS

నాగోబా ఆలయాన్ని సందర్శించిన దివ్వాదేవరాజన్

Satyam NEWS

నేతన్నల ను ముంచిన వరుస వర్షాలు

Satyam NEWS

Leave a Comment