20.7 C
Hyderabad
December 10, 2024 01: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

y s jagan Tadepally

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేతుల మీదుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన భవనం ప్రారంభం అయింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ చేతుల మీదుగా రిబ్బన్‌ కట్టింగ్ జరిగింది. అనంతరం కార్యాలయంలోని అన్ని విభాగాలను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి  జగన్‌ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులు అర్పించారు.

Related posts

నీతి నిజాయితీతో పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ

Satyam NEWS

“జగనాసుర రక్త చరిత్ర”…అంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచే..!

Bhavani

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment