27.7 C
Hyderabad
April 20, 2024 02: 06 AM
Slider ముఖ్యంశాలు

మస్సె ఫెర్గుసన్‌ 244– పడ్లింగ్ స్పెషల్‌ ట్రాక్టర్లను ప్రవేశపెట్టిన టాఫె

#TAFE

దేశంలో ప్రధాన ట్రాక్టర్‌ సంస్థ, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ట్రాక్టర్‌ తయారీదారునిగా ఖ్యాతి గడించిన  టాఫె – ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌, మస్సె ఫెర్గుసన్‌ 244 డీఐ –  పడ్లింగ్ స్పెషల్‌ ట్రాక్టర్స్‪ని 44 హెచ్‌పీ శ్రేణిలో వరి పంట సాగు అవసరాల కోసం ప్రవేశపెట్టింది.

టాఫె నుంచి వచ్చిన మరో విప్లవాత్మక ఉత్పత్తి అయిన మాస్సీ ఫెర్గుసన్‌ 244 రెండు మోడల్స్ లో లభిస్తాయి. మెట్టభూములు లేదా గుల్లభూముల్లో దుక్కిదున్నడం కోసం ఎంఎఫ్‌ 244 డీఐ పీఎం బాగా పనిచేస్తుంది. చవుడు నేలల్లో లోతుగా దుక్కిదున్నడంలో ఎంఎఫ్‌ 244 పీడీ అద్భుతాలను సృష్టించగలదు. వినియోగదారుల అవసరాలని దృష్టిలో వుంచుకుని టాఫె వారు ఆంధ్రపదేశ్ మార్కెట్లో ప్రవేశపెట్టిన మరొక ఉత్పత్తే ఎంఎఫ్‌ 244. ఇది మరింత శక్తిని, అధిక విలువను అందిస్తుంది. అదే సమయంలో, అత్యున్నత వైవిధ్యత, అద్భుతమైన పనితీరు, అధిక ఆదా, ఉత్తమ ఉత్పాదకతనూ అందిస్తుంది.

ఎంఎఫ్‌ 244 ట్రాక్టర్లు  దుక్కిదున్నడంలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూనే, వైవిధ్యమైన వ్యవసాయ అవసరాలైన దుక్కిలో ఉపయోగించే నాగలి, నూర్పు, బేలర్‌, ఇంకా అధిక శక్తితో బరువు లాగడం వంటిపనులకి తగినట్లుగా ఉంటాయి. ఈ అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఉత్పత్తి, పూర్తిగా సరికొత్త 44 హెచ్‌పీ సింప్సన్‌ సూపర్‌ టార్క్‌ ఇంజన్‌, ఆధారపడదగ్గ, మన్నికైన మ్యాక్స్‌ ఆయిల్‌ ఇమ్మర్స్‪డ్ బ్రేకులు, ప్రత్యేక పవర్వేటర్‌ క్లచ్‌, ఆల్ట్రా ప్లానెటరీ ప్లస్‌ సాంకేతికత,  అత్యున్నత ఎంఎఫ్‌ ఇంటెల్లిసెన్స్ హైడ్రాలిక్స్‌తోపాటు ఈ విభాగంలో అత్యుత్తమ 1700 కేజీల లిఫ్ట్‌ సామర్థ్యాన్ని కూడా కలిగివున్నాయి.

అతి క్లిష్టమైన పనులను కూడా సులువుగా నిర్వహించగల ఎంఎఫ్‌ 244లోని సింప్సన్‌ సూపర్‌ టార్క్‌ ఇంజన్‌, అధికశక్తి, అధిక టార్క్‌, అత్యధిక ఇంధన సామర్ధ్యం అందిస్తుంది, అంతేకాక ఏడాదికి దాదాపు 60 వేల రూపాయల ఇంధన ఖర్చును ఆదా చేస్తుందని అంచనా. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దీని మస్సె ఇంటెల్లిసెన్స్‌ హైడ్రాలిక్స్‌ వల్ల, ట్రాక్టర్‌పై కనీసపక్ష బరువు మాత్రమే వుంటుంది, దాంతో చక్రం జారిపోవడాన్ని తగ్గించి, ఏకరీతిలో సాగుబడి చేయడానికి, సౌకర్యవంతంగా దుక్కి దున్నడానికి వీలుకల్పించడమేకాక, ట్రాక్టర్‌కు దీర్ఘకాలం మన్నేలా చేస్తుంది.

అరవై సంవత్సరాలకు పైగా టఫె వారి నిరూపిత ఇంజినీరింగ్‌ నైపుణ్య్యం, ట్రాక్టర్‌ పరిశ్రమ పట్ల అవగాహన, విజ్ఞానాలు,  వినియోగదారులే కేంద్రంగా భారతీయ రైతుల కోసం ఉత్పత్తులను సృష్టించడంలో దోహదపడ్డాయి. ఇప్పుడు పడ్లింగ్‌ స్పెషల్ ఎంఎఫ్‌ 244 ప్రవేశపెట్టడం ద్వారా టఫె, భారతీయ ఇంజినీరింగ్‌ శక్తిని ఇంకా ఆంధ్రప్రదేశ్‌ రైతుల పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించింది.

మీడియా సంప్రదింపులకు: సునీతా సుబ్రమణియన్, జిఎం – కార్పొరేట్ కమ్యూనికేషన్స్, TAFE | corporate@tafe.com  

Related posts

పాక్ లో దారుణం: మతి స్థిమితం లేని వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు

Satyam NEWS

వనపర్తిలో డ్రా పద్దతిలో బార్ లు కేటాయించిన కలెక్టర్

Satyam NEWS

జాతీయ సేవారత్న అవార్డును అందుకున్న నేతావత్ సుధాకర్

Bhavani

Leave a Comment