34.2 C
Hyderabad
April 19, 2024 21: 52 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా టైలర్స్ దినోత్సవం

#tailarsday

కుట్టు మిషను కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది కి జీవనోపాధి కల్పించిన కుట్టు మిషను సృష్టి కర్త విలియమ్స్ హవే ని స్మరించుకుంటూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ట్రైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు.

హుజూర్ నగర్ పట్టణ ట్రైలర్స్ యూనియన్ అధ్యక్షుడు గూడ శ్రీనివాస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ట్రైలర్స్ యూనియన్ నాయకుడు షేక్.బాజీఉల్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రైలర్స్ సోదరులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి దర్జీ కళాకారులకు సాయం అందించాలని కోరారు.55 సంవత్సరాలు నిండిన ప్రతి టైలర్ సోదరులకు పింఛను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అత్యున్నత చదువులు చదివిన వేలాది మంది నిరుద్యోగులు టైలరింగ్ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారని,దర్జీ వృత్తిదారుల కి సబ్సిడీ ద్వారా బ్యాంకు ఋణాలు ఇప్పించాలని అన్నారు.నిరుపేద ట్రైలర్స్ సోదరులు అందరికీ రేషన్ కార్డులు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రైలర్స్ యూనియన్ నాయకులు డేవిడ్,పివి,సిగ సత్యం,జాని,రామారావు, ఎస్.శ్రీనివాసరావు, ఆర్.శ్రీను, వీరయ్య, రామకృష్ణ, దర్జీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నో డాక్టర్: నడి రోడ్డుపైనే మహిళ ప్రసవం

Satyam NEWS

నాణ్యమైన విద్య అందించేందుకు విశేష కృషి

Satyam NEWS

వృద్ధ దంపతులకు సహాయం చేసిన Rti24 news

Satyam NEWS

Leave a Comment