27.7 C
Hyderabad
April 20, 2024 02: 24 AM
Slider హైదరాబాద్

మమ్మల్ని నీటిలో ముంచిన డ్రైనేజీ కాంట్రాక్టర్

#HunanRights

హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ మల్లికార్జున్ నగర్ లో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లు మునిగిపోవడం డ్రైనేజి కాంట్రాక్టర్ తప్పిదమే కారణమేనని ఆరోపిస్తూ స్వామి వివేకానంద  యువసేన నేడు మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.

మల్లికార్జున్ నగర్ లో ఇళ్లు మునిగేందుకు అవకాశమే లేదని కేవలం సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల దారుణం జరిగిందని యువసేన ఆరోపించింది.

ఇళ్లు నీట మునగడానికి   కారణం అయిన డ్రైనేజ్ కాంట్రాక్టర్, AE, DE, EE, SE, అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని, కాంట్రాక్టర్ లైసెన్సు రద్దు చేయాలని కోరారు. అప్పటి AE, DE, EE, SE అధికారులపై కూడా విచారణ చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు.

మొత్తం డ్రైనేజీ సిస్టం చెరువులో నుంచి తీసేసి బయటి నుంచి వేయవలసిందిగా  వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దేవరుప్పల శ్రీకాంత్,  శశిపాల్, అశోక్,  వంశీ, పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: గ్రామాలలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Satyam NEWS

ఐజేయూ జర్నలిస్టుల పోరు బాట

Satyam NEWS

రైతుల్ని దోచుకునేందుకు వైసీపీ ఫోన్ పే బ్యాచ్ లు దిగాయి

Bhavani

Leave a Comment