వనపర్తి పట్టణంలోని ఇందిరాపార్క్ ప్రక్కన ఉన్న కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ యాజమాన్యం నిర్వహణ నిర్లక్ష్యం కారణంగా వనపర్తి మున్సిపల్ అధికారులు స్కూల్ ను సీజ్ చేశారని నాయకులు తెలిపారు. వనపర్తిలో కృష్ణవేణి హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని బిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోలు రాము, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి, బిజీవీఎస్ రాష్ట్ర నేత శివ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణవేణి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల విలువైన చదువుకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి చిట్యాల రాము, పట్టణ అధ్యక్షుడు రవి గౌడ్,బిజీవీ ఎస్ మండల అధ్యక్షుడు అరుణ్ నాయక్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్