28.2 C
Hyderabad
April 20, 2024 12: 20 PM
Slider హైదరాబాద్

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

#cpm city

అంబర్ పేట్ నియోజకవర్గంలో మూసీనది అంచున మూసారాంబాగ్ నుండి రామంతాపూర్ వరకు వందల ఎకరాల స్థలాలను భూకబ్జాదారులు మట్టిని నింపి కబ్జాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టి శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది.

కబ్జాదారుల పాలవుతున్న భూమిని కాపాడి అంబర్ పేట్ లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టియ్యాలని డిమాండ్ చేస్తూ అలీ కేఫ్ చౌరస్తా నుండి ట్రీట్ మెంట్ ప్లాంట్ వెనుక వున్నా ఖాళీ స్థలం వరకు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం అంబర్ పేట్ నియోజకవర్గం కన్వీనర్ మహేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 10 వేల మందికి ఇక్కడ ఇండ్ల  కట్టించేంత స్థలం  ఉందన్నారు. భూమిలో ఎర్ర జెండాలు నాటామన్నారు. ఈ  కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదయ్య, రాయిస్, మోహన్, రఘు, సత్తి, రజిత, రాములు, బాల నాగమ్మ, సుజాత, సివి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు

Related posts

కుమరం పులి:సామాన్యుడి అసామాన్య పోరాటం

Satyam NEWS

ఉద్యోగమేమో ఫుల్ టైం జీతం మాత్రం పార్ట్ టైం

Satyam NEWS

ఇంట్రోస్పెక్షన్: పౌరసత్వంపై ఇక చాలు తగ్గండి

Satyam NEWS

Leave a Comment