35.2 C
Hyderabad
April 20, 2024 15: 12 PM
Slider నల్గొండ

జనాన్ని కొల్లగొడుతున్న మద్యం వ్యాపారులు

#Liquor Shops

కేసీఆర్ ప్రభుత్వం 15 శాతం రేట్లను పెంచితే, మద్యం వ్యాపారులు సిండికేటై 30 శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజా పోరాట సమితి(PRPS) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి ఆరోపించారు. ఈ మద్యం సిండికేట్ లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ రోజు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాల ముందు ప్లేకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ “లిక్కర్ మాఫియాతో ఎక్సైజ్ శాఖ కుమ్మక్కై పోయిందని, లాక్డౌన్ లో మద్యం షాపులు మూసి వున్నా షాపులలో ఉన్న సరుకంతా బ్లాక్ మార్కెట్ కు తరలిందని, దీనిపై సమగ్ర విచారణ జరగలేదని దోషులను పట్టుకోలేదని ఆయన అన్నారు.

ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తిందని,నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీరు లేకున్నా,గల్లీకో బెల్టుషాపు ఏర్పడి సామాన్యులను దోపిడీ చేస్తోందని,నాటుసారాను అరికట్టిన ప్రభుత్వం బెల్టు షాపులను ఎందుకు అరికట్టదని ప్రశ్నించారు. ఇంకా నాయకులు నాగిళ్ళ యాదయ్య,ముప్పిడి మారయ్య,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,ఎన్.నరేష్,మారగోని శ్రీనివాస్,రేపాక వెంకటేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి

Bhavani

కమలం గూటికి చేరబోతున్న గులాంనబీ ఆజాద్?

Satyam NEWS

మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా నామినేషన్ వేసిన డా. కిషన్

Bhavani

Leave a Comment