39.2 C
Hyderabad
March 29, 2024 15: 38 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ ఎస్సీ మెనెజ్ మేంట్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

#tarasingh

నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.తారా సింగ్ ఆరోపించారు. ఈ విషయం బయటకు చెప్పవద్దని హాస్టల్ వార్డెన్   విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

వారానికి నాలుగు గుడ్లు ఇవ్వాలి కానీ వారానికి ఒక్క గుడ్డు కూడా ఇవ్వడం లేదని అలాగే వారానికి 3 అరటి పండ్లు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులే బాత్రూమ్ లెట్ రూమ్స్ శుభ్రం చేసుకుంటున్నారని అన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఆమెకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ కొత్తగా వచ్చిన అడ్మిషన్లను కూడా అడ్మిషన్లు లేవు మీరు వెళ్లిపోవాలని వచ్చిన వారిని పంపడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా విద్యార్థులు వార్డెన్ కి మెనూ ప్రకారం భోజనం పెట్టండని అడుగుతే హాస్టల్ నుండి మీకు బయటకు గెంటేస్తా అంటూ తిడుతున్నారని అన్నారు. మేడం భోజనం మంచిగా పెట్టండని విద్యార్థులు అడిగుతే మీరు తినడానికి వచ్చారా చదువుకోడానికి వచ్చారా చదువుకోండి చదివిన తర్వాతనే మీరు వచ్చి నన్న అడగాలి మీకు అడిగే అర్హత నాకు లేదు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపొండి అంటూ వార్డెన్ అంటున్నారని వారు తెలిపారు.  వార్డెన్ పై చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్యర్యం పెద్దఎత్తున ఆందోళన చేస్తాం అని వారన్నారు.  ఈ కార్యక్రమంలో గణేష్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

లోకేశ్వరి, పురందేశ్వరి ఆవిష్కరించిన మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్

Satyam NEWS

జెండా పండుగ పోస్టర్ ని ఆవిష్కరించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

గుజరాత్ లో మజ్లీస్ అధినేత ఒవైసీకి నిరసనలు

Satyam NEWS

Leave a Comment