28.7 C
Hyderabad
April 24, 2024 05: 42 AM
Slider మహబూబ్ నగర్

అనుమతిలేకుండా బ్రిడ్జి నిర్మిస్తున్న రియలెస్టేట్ కంపెనీ

#Real Estate Company

వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో D36 మెయిన్ కెనాల్ పై ఆనుమతి లేకుండ బ్రిడ్జి నిర్మిస్తున్న  శ్రీ మణికంఠ రియల్ ఎస్టేట్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మార్కెట్ చెర్మెన్ రామచంద్రారెడ్డి TRS పార్టి చిన్నంబావి మండల అధ్యక్షుడు బిచుపల్లి యాదవ్ నాయకులు వడ్డెమాన్ బిచ్చన్న గోవిందు తదితరులు డిమాండ్ చేశారు.

ఇలా వెంచర్లు వేస్తున్న వారు స్వలాభం కోసం కెనాలు పై బ్రిడ్జి నిర్మిచడం వల్ల నీటి పారుదల కు అడ్డంకి ఏర్పడి చివరి ఆయకట్టు రైతుల పంటపొలాలకు నీళ్ళు రాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. మునుముందు పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు.

జూరాల అధికారులు ఇంతకు ముందే  అక్రమంగా బ్రిడ్జి నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న రియల్ ఎస్టేట్ వారి పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజల తరపున డిమాండు చేస్తున్నామని అన్నారు.

వెంచర్లకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రతి వెంచరు వాళ్లు బ్రిడ్జి నిర్మాణాలు చేపడితే నీళ్ల పారుదల కు పూర్తిగా ఆగిపోవడమే కాక బైపాస్ ఏర్పడి కొత్తగా కోరి తెచ్చుకున్న చిన్నంబావి మండల కళ తప్పే ప్రమాదం పొంచి ఉందని వారన్నారు. కెనాల్ పై బ్రిడ్జి లు నిర్మిచకుండగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Related posts

మూఢ నమ్మకాలు వదిలేస్తేనే అభివృద్ధి చెందుతాం

Satyam NEWS

త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్

Bhavani

హాజరు హో:లండన్ కోర్టులో విచారణకు విజయ్ మాల్యా

Satyam NEWS

Leave a Comment