30.7 C
Hyderabad
April 24, 2024 01: 44 AM
Slider చిత్తూరు

తిరుపతిలో “కుక్క కాటుకు” మందేది ?

#naveenkumarreddy

తిరుపతి నగరంలో వీధి కుక్కలను (గ్రామ సింహాలను) కట్టడి చేయడంలో నగరపాలక సంస్థ పాలకులు,అధికారులు చేతులెత్తేశారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థలో వెటర్నరీ డాక్టర్ పోస్టు ను భర్తీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?

తిరుపతి “స్మార్ట్ సిటీలో” సుమారు 10 వేల కుక్కలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అందులో ఎన్నింటికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు? మిగిలిన వాటికి ఎందుకు వేయలేదు?  నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణకు నిధులు మంజూరు చేయకపోవడం లోని ఆంతర్యం ఏమిటి?

అధికారులు వెంటనే ముందస్తు అప్రూవల్ కింద నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో ఏ వీధిలో చూసినా ఏ సందులో చూసినా తినే పదార్థాలు, మాంసాహారం దొరికే చోట గ్రామ సింహాలు (వీధి కుక్కలు) విచ్చలవిడిగా గుంపులుగా తిరుగుతూ దారిన వెళ్లే వారిపై దాడి చేసి గాయపరిచే ప్రమాదాలు వున్నాయి అలాంటివి జరగకముందే నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం కావాలి.

హైదరాబాద్ మహానగరంలో రెండు రోజుల క్రితం వీధి కుక్కలు 4 సం” పసిబిడ్డను రోడ్డుపై దాడి చేసి ప్రాణాలు తీసిన సంఘటన హృదయ విధారకం,ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తిరుపతి మహానగరంలో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రతినిత్యం వచ్చే వేలాదిమంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టిటిడి,నగరపాలక సంస్థ సమన్వయంతో టిటిడి వసతి సముదాయాలు,రైల్వే స్టేషన్, బస్టాండ్,హోటల్స్ పరిసర ప్రాంతాలలో వీధి కుక్కల నియంత్రణకు “మొబైల్ వ్యాన్” లు ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

నగరంలో ప్రమాదవశాత్తు వీధి కుక్కలు పాదచారులపై,పసి పిల్లలపై దాడి చేస్తే అత్యవసరంగా కార్పొరేషన్ కు సంబంధించిన సుమారు 18 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ (PHC) లకు వెళ్తే అక్కడ కుక్క కాటుకు మందు లేదు కనీసం సీజనల్ జబ్బులకు సైతం మందులు అందుబాటులో లేదు. నగర ప్రజలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,ఫుట్ పాత్ హోటల్ యజమానులు సైతం చైతన్యంతో మిగిలిపోయిన తినుబండారాలను రోడ్లపై వేయడం మానుకొని నగరపాలక సంస్థ అధికారులకు సహకరించాలి.

నగరపాలక సంస్థ పాలకులు, అధికారులు “చేతులు కాలాక ఆకులు పట్టుకున్న” చందంగా కాకుండా వీధి కుక్కల కట్టడికి వెంటనే వెటర్నరీ డాక్టర్ ను నియమించి ప్రత్యేక నిధులు కేటాయించి వీధి కుక్కలకు 100% ఆపరేషన్ చేసి,వ్యాక్సిన్ వేసి నగర ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

బ్రేవ్ పోలీస్:బావి నుండి కుక్క పిల్లలను రక్షించారు

Satyam NEWS

శ్రీలంకలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

పువ్వాడ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

Murali Krishna

Leave a Comment