Slider నెల్లూరు

హైకోర్టుపై అనుచిత పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయరా?

#Nellore TDP

ఒక ఎస్పీని ఏక వచనంతో సంబోధించి దమ్ముంటే అరెస్ట్ చేసుకో అన్న అధికారపార్టీ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్న పోలీసులు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వారిని అరెస్టు చేస్తున్నారనని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

విడవలూరు తెలుగు యువత నాయకుడు సత్యంరెడ్డి అరెస్టును ఖండిస్తూ నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ వద్ద  జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక A S I చేతిలో ఫోను లాక్కొని నోటి కొచ్చినట్లు తిట్టి ఎవరికి చెప్పుకుంటావో చెప్పు కో పో అన్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులపై  వ్యకిగతంగా కించపరిస్తూ పోస్టులు పెట్టిన వైసీపీ వారిపై చర్యలు లేవు, తెలుగుదేశం పార్టీ వారు కేవలం ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.

తక్షణమే సత్యంరెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు ను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై అనుచితమైన పోస్టులు పెట్టిన వైసీపీ వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

ఆర్టీసీ కార్మికులు, మీడియాపై పోలీసు జులూం

Satyam NEWS

దినోత్సవాలకే పరిమితమవుతున్న దివ్యాంగుల జీవితాలు

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నోటీస్

Sub Editor

Leave a Comment