39.2 C
Hyderabad
March 29, 2024 15: 09 PM
Slider అనంతపురం

బర్డ్ ఫ్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి

#AnantapuramCollector

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని (ఆసరా, సంక్షేమం) జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పెరటి కోళ్లు, కోళ్ల ఫారాలు, వలస పక్షుల పై నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే పక్షుల మరణాలు, సురక్షిత విధానాల పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రతి సంవత్సరం సైబీరియన్ పక్షులు వీరాపురం పరిసర ప్రాంతాలలో వలస రావడం కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ ఛాయలు అటవీ పక్షులలో కనిపించడం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య, జడ్పీ పంచాయతీ, అటవీ, పశుసంవర్ధక తదితర శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ స్వరూపరాణి, జడ్పీ సీఈవో శోభా స్వరూప రాణి, డీఎంహెచ్ఓ డా. కామేశ్వర ప్రసాద్, డా. రామ చంద్ర, డా. గోల్డెన్ సన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా పై పోరాటానికి కదిలిన అధికార యంత్రాంగం

Satyam NEWS

మహిళల కష్టాలు తీర్చేందుకు పోలీసులు ముందుండాలి

Satyam NEWS

రోడ్డు ప్రమాదాలలో 5గురు మృతి

Bhavani

Leave a Comment