28.7 C
Hyderabad
April 24, 2024 03: 22 AM
Slider నల్గొండ

కరోనానే కాదు అంటువ్యాధులున్నాయి జాగ్రత్త

#Awarwnes Programme

కరోనా వ్యాధి తో బాటు సీజనల్ వ్యాధులపై ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ అన్నారు. గోపాలపురం గ్రామంలో నేడు ఆయన కరోనా,  సీజనల్ వ్యాధులపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ హుజుర్ నగర్  మండల పరిధిలో ఇప్పటికి 15 మందికి కరోనా పాజిటీవ్ వచ్చిందని తెలిపారు. అందుకే పాజిటీవ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో 1% sodium hypochlorite  ద్రావణం స్ప్రే చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వేను సుమారుగా 14 రోజుల పాటు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.

కనుక సర్వేలో పాల్గొనే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని, ఆరోగ్య సిబ్బంది అడిగిన వివరాలు తెలుపాలని కోరారు. ICMR guidelines ప్రకారం COVID-19 positive నిర్ధారణ అయినప్పటికి ఆరోగ్యంగా ఉన్నా, వ్యాధి లక్షణాలు లేని ఆ వ్యక్తి స్వీయ సమ్మతితో వారి సొంత ఇంట్లో విడిగా ఉండేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు.

తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH) సూర్యాపేట లేదా హైద్రాబాద్ కి తరలించి చికిత్స అందిస్తామని చెప్పారు. కరోనా సోకిన రోగులపై , వారి కుటుంబాలపై వివక్షత చూపొద్దని, తోచిన సహాయం చేయాలని ఆయన కోరారు. మాస్కులు ధరించి, చేతులు  తరచుగా  సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కొంటూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, ఝాన్సీరాణి,గ్రామ కార్యదర్శి మేకల శేఖర్,  విన్నపం ఒక పోరాటం అధ్యక్షులు చీకూరి లీలావతి, ఆశావర్కర్లు యశోద, విజయ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

2016 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి

Satyam NEWS

ప్రత్యక్షంగా ప్రజల ప్రాణాలు కాపాడే దేవుళ్ళు వైద్యులు

Satyam NEWS

నకిలీ పురుగుమందులతో రైతులకు తీరని నష్టం

Satyam NEWS

Leave a Comment